రోమ్: మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న అరీనా సబలెంకకు ఇటాలియన్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సబలెంక.. 4-6, 3-6తో కిన్వెన్ జెంగ్ (చైనా) చేతిలో పరాభవం పాలైంది. 22 ఏండ్ల ఈ చైనా అమ్మాయికి కెరీర్లో సబలెంకపై ఇదే తొలి విజయం.
ఎనిమిదో సీడ్ జెంగ్.. సెమీస్‌లో అమెరికా సంచలనం కోకో గాఫ్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో అల్కారజ్ 6-4, 6-4తో డ్రాపర్(బ్రిటన్)ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.