World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు
World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరును వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం.
ఇక ఫైనల్ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరనున్న ప్రపంచకప్ ముంగిట భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు (Air Show) చేయబోతోంది. ఈ విషయాన్ని గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ పీఆర్వో గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి.
ఇందుకోసం శుక్ర, శనివారాల్లో ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌లో మరో ప్రత్యేక కార్యక్రమం కూడా ఉన్నట్లు తెలస్తోంది. గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్‌కు ముందు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపింది.
కాగా, ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2003 తుదిపోరులో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. ఇక ఈ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మంచి ఫామ్‌లో ఉంది. ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచింది. ఈ సారి కప్పు కొట్టాలన్న కసితో ఫైనల్స్‌కు సిద్ధమవుతోంది.
Also Read..
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
Raw Eggs | వంద పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్.. వీడియో
Hardik Pandya: ఆసీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

