Hardik Pandya: ఆసీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా దూరం
Hardik Pandya: వరల్డ్‌కప్ మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు. ఆసీస్‌తో పాటు సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌కు కూడా హార్దిక్‌ను పక్కనపెట్టేశారు.
ముంబై: వరల్డ్‌కప్ మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు. వరల్డ్‌కప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగే మూడు టీ20, మూడు వన్డేలకు కూడా హార్దిక్ దూరంకానున్నాడు.
వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో లింటన్ దాస్ కొట్టిన షాట్‌ను కాలితో ఆపబోయిన హార్దిక్ .. మడిమ తిరిగి కింద పడిపోయాడు. దీంతో అతను లేవలేకపోయాడు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హార్దిక్ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్న అతన్ని ఆసీస్, సఫారీ జట్లతో జరిగే సిరీస్‌లకు దూరం పెట్టేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

