Raw Eggs | వంద పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్.. వీడియో
Raw Eggs | గుడ్డు (Egg).. ఇది ఆరోగ్యానికి వెరీగుడ్ ఫుడ్. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కొందరు రోజూ ఉడికించిన గుడ్డును తింటుంటారు. పచ్చి గుడ్డు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ, పచ్చి గుడ్డును తినడం మాత్రం చాలా కష్టం. అలాంటిది ఓ యూట్యూబర్ (YouTuber), ఫిట్నెస్ ఇన్ఫ్యూయెన్సర్ మాత్రం ఏకంగా వంద పచ్చి గుడ్లను ఒకేసారి తాగేశాడు.
Raw Eggs | గుడ్డు (Egg).. ఇది ఆరోగ్యానికి వెరీగుడ్ ఫుడ్. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కొందరు రోజూ ఉడికించిన గుడ్డును తింటుంటారు. పచ్చి గుడ్డు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు. పచ్చి గుడ్లు (Raw Eggs) తీసుకోవడం వల్ల మెదడుకు జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతుంటారు. వీటిని ఎక్కువగా వ్యాయామం చేసేవారు తీసుకుంటుంటారు. కానీ, పచ్చి గుడ్డును తినడం మాత్రం చాలా కష్టం. అలాంటిది ఓ యూట్యూబర్ (YouTuber), ఫిట్నెస్ ఇన్ఫ్యూయెన్సర్ మాత్రం ఏకంగా వంద పచ్చి గుడ్లను ఒకేసారి తాగేశాడు.
షాక్ అయ్యారు కదూ.. ! మీరు వింటున్నది నిజమే. విన్స్ ఇయానోన్ (Vince Iannone) అనే యూట్యూబర్ తనకు 100K (లక్ష) ఫాలోవర్స్ వచ్చినందుకు గానూ ఈ సాహసం చేశాడు. జిమ్‌లో నిలబడి ఉన్న విన్స్.. ఓ పెద్ద మగ్గు నిండా పచ్చిగుడ్లను నింపుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో వివరిస్తూ.. మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్ని తాగడం ప్రారంభిస్తాడు. సగం తాగేశాక కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ కాస్త తాగుతాడు. సగానికిపైగా అయిపోయిన తర్వాత మగ్ను పక్కకు పెట్టి నాలుగు పుషప్స్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ తాగడం కొనసాగిస్తాడు. అలా మొత్తం మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్నంతా కంప్లీట్ చేసేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read..
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
MLC Kavitha | గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా?: ఎమ్మెల్సీ కవిత
Virat Kohli | సచిన్‌ను కోహ్లీ దాటేస్తాడు: రవిశాస్త్రి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

