హైదరాబాద్: సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆక్షేపించారు.
‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా???! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!. ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా?
పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ… pic.twitter.com/N4bni4z4qU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 17, 2023