World Cup 2023 | రేపే న్యూజిలాండ్‌తో సెమీస్ సమరం.. వాంఖడే పిచ్‌ను పరిశీలించిన భారత కోచ్
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India) కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్(Newzealand)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియా ముంబైలోని...
World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India) కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్(Newzealand)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియా ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhade Stadium)లో నవంబర్ 15 బుధవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీఫైనల్లో కివీస్‌ను మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచింగ్ సిబ్బంది సోమవారం వాంఖడే పిచ్‌ను పరిశీలించింది.
ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పిచ్‌ను ఆసాంతం గమనించారు. బ్యాటింగ్‌కు ఎంతమేర అనుకూలిస్తుంది? టాస్ గెలిచాక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా? బౌలింగ్ చేయాలా? అనేదానిపై ఓ అంచనాకు వచ్చారు.

సొంత గడ్డపై 12 ఏండ్ల తర్వాత జరుగుతున్న ప్రపంచ కప్‌లో భారత జట్టు ఓ రేంజ్లో ఆడుతోంది. ఫేవరేట్ ట్యాగ్‌ను నిలబెట్టుకుంటూ వరుసపెట్టి ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే.. ఐసీసీ టోర్నీల్లో బ్లాక్‌క్యాప్స్ ఇప్పటికే పలుమార్లు భారత్‌కు షాకిచ్చింది. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో, 2021 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ పైచేయి సాధించింది.

దాంతో, ఈసారి వాటికి ప్రతీకారం తీర్చకోవాల్సిన టైమ్ వచ్చింది. మెగా టోర్నీ లీగ్ దశలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే కసితో ఉంది. టాపార్డర్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్, సూర్య, జడేజా సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసిరానుంది. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, సిరాజ్ పేస్ త్రయం కివీ బ్యాటర్లను మరోసారి వణికించేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
-
Samoa | భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. ఎక్కడంటే?
-
Umar Gul | పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ స్పీడ్‌స్టర్?.. పీసీబీ నిర్ణయమే తరువాయి
-
Vote | ఓటరు జాబితాలో మీ పేరుందా?.. తెలుసుకోండిలా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

