Umar Gul | పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ స్పీడ్‌స్టర్?.. పీసీబీ నిర్ణయమే తరువాయి
Umar Gul : వన్డే వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్(Pakistan) సెమీస్ ముందు బొక్కాబోర్లాపడింది. ప్రధాన పేసర్లు ఆఫ్రిది, హ్యరిస్ రవుఫ్ ధారాళంగా పరుగులివ్వడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. దాంతో, బౌలింగ్ యూనిట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మోర్నీ మోర్కెల్(Morne Morkel) బౌలింగ్ కోచ్‌గా...
Umar Gul : వన్డే వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్(Pakistan) సెమీస్ ముందు బొక్కాబోర్లాపడింది. ప్రధాన పేసర్లు ఆఫ్రిది, హ్యరిస్ రవుఫ్ ధారాళంగా పరుగులివ్వడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. దాంతో, బౌలింగ్ యూనిట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మోర్నీ మోర్కెల్(Morne Morkel) బౌలింగ్ కోచ్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే.. మరో ఏడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున అతడి స్థానంలో వెంటనే మరొకరిని నియమించాల్సిన పరిస్థితి. దాంతో, ఈసారి విదేశీ కోచ్‌లకు కాకుండా పాక్ మాజీ పేసర్‌కు కోచ్ పగ్గాలు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అనుభవజ్ఞుడైన మాజీ స్పీడ్‌స్టర్ ఉమర్ గుల్(Umar Gul) రేసులో ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ పదవి కోసం గుల్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ పదవి కోసం ఇప్పటికైతే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నన్ను సంప్రదించలేదు. ఒకవేళ పాక్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపికైతే అది నాకు చాలా గర్వకారణం అని కరాచీలోని ఓ కార్యక్రమంలో ఈ మాజీ పేసర్ పేర్కొన్నాడు. పాక్ గొప్ప బౌలర్లలో ఒకడైన గుల్ మూడేండ్ల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ప్రపంచ కప్‌లో బాబర్ సేన చెత్త ఆటలో 5వ స్థానానికి పరిమితమైంది. ఉపఖండ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్నప్పటికీ సమిష్టి వైఫల్యంతో సెమీస్ బెర్తును చేజార్చుకుంది. పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోపు కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
-
Israel | గాజాపై పట్టుకోల్పోయిన హమాస్.. ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
-
TR | 6 గ్యారెంటీలు కాదు.. 6 నెలలకో సీఎం.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే: మంత్రి కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

