Vote | ఓటరు జాబితాలో మీ పేరుందా?.. తెలుసుకోండిలా
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Vote | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ ఓటు ఉన్నదా? లేదా? ఓటు ఉంటే పోలింగ్ స్టేషన్ ఎక్కడ? అన్న విషయాలను తెలుసుకోవటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఓటు ఉన్నదో, లేదోనన్నది https:// electoralsearch.eci.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి పేరు, ఇతర వివరాలు నమోదు చేయడం ద్వారా, ఓటరు కార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా, ఫోన్ నంబర్ ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలు పొందవచ్చు. ఓటు హక్కు ఉంటే వివరాలన్నీ కనిపిస్తాయి. పేరు, తండ్రి పేరు, ఓటరు కార్డు నంబర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ ఉంటాయి.
ఈ వివరాలను ప్రింట్ తీసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓటరు వివరాలు నమోదు చేయడం, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేయటం, బార్ కోడ్, క్యూఆర్ కోడ్ ద్వారా ఓటు ఉన్నదో, లేదో తెలుసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవటానికి కూడా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లో ఓటరు కార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా పోలింగ్‌స్టేషన్‌ను తెలుసుకోవచ్చు. నో యువర్ పోలింగ్ స్టేషన్‌పై క్లిక్ చేస్తే అక్కడ ఓటరు కార్డు నంబర్ అడుగుతుంది. ఎంటర్ చేస్తే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ అడ్రస్ చూపిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

