Sachin Tendulkar | ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత వుమెన్స్ క్రికెట్‌కు ఓ టర్నింగ్ పాయింట్ కాగలదని టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇది కేవలం టైటిల్స్‌ను గెలిచే టోర్నమెంట్ మాత్రమే కాదని, అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా కొనసాగించాలనే వారి కలలను నెరవేర్చుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపాడు. ఇంగ్లండ్ వేదికగా 2017లో జరిగిన ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకొని మహిళల జట్టు జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే, టీమిండియా వుమెన్స్ జట్టు ఇప్పటి వరకు ప్రపంచకప్‌ను గెలువలేదు.
ఈ సారి హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో తొలిసారిగా కప్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందని.. మహిళల క్రికెట్‌కు దిశానిర్దేశం చేయగలదని టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 2017 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 171 పరుగులు చేయడం తనకు ఇప్పటికీ గుర్తుందని.. షాట్ల ఎంపికలో నిర్భయత్వం, మనసులో స్పష్టత, ఆమె ధైర్యం భారత్‌లో వుమెన్స్ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చివేశాయని.. జనం మహిళల క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించిన క్షణం అదేనని టెండూల్కర్ తన ఐసీసీ కాలమ్‌లో పేర్కొన్నాడు. హర్మన్‌ప్రీత్ లాగా ఉండాలని బ్యాట్‌ను గట్టిగా పట్టుకునే ఒక అమ్మాయి ఉంటుందని, సాంగ్లిలో స్మృతి మంధాన లాగా కవర్ డ్రైవ్‌లు ఆడాలని మరో అమ్మాయి ఉంటుందని పేర్కొన్నాడు. స్మృతి మంధాన బ్యాటింగ్ నైపుణ్యం తనను ఆకట్టుకుందని టెండూల్కర్ తెలిపాడు.
స్మృతి బ్యాటింగ్ ఒక కళ లాంటిదని.. ఆమె షాట్ ప్లే, టైమింగ్, గ్యాప్‌లను గుర్తించే సామర్థ్యం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్ వుమెన్‌లలో ఒకరిగా నిలిపాయన్నారు. భారత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్ మహిళల క్రికెట్‌కు అవసరమైన గుర్తింపును తీసుకువస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్లో వచ్చిన మార్పులకు ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షాకు క్రెడిట్‌కు అర్హుడని సచిన్ పేర్కొన్నాడు. బీసీసీఐ కార్యదర్శిగా తన పదవీకాలంలో మెన్స్, వుమెన్స్ క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజులను అమలు చేయడం.. వుమెన్స్ పీమియర్ లీగ్ ప్రారంభంలో కీలక పాత్ర పోషించాడని అభినందించాడు.
Read More :
Tilak Varma | పాక్ క్రికెటర్ల మాటలకు బ్యాట్‌తోనే బదులిచ్చా.. ‘వైల్డ్ సెలబ్రేషన్’కు కారణమదే..!
PCB | భారత్ చేతిలో ఘోర పరాజయం.. పీసీబీ చైర్మన్ నఖ్వీపై తీవ్ర విమర్శలు.. తొలగించాలని డిమాండ్..!
PCB | పాకిస్తాన్ క్రికెటర్లకు షాక్ ఇచ్చిన పీసీబీ.. విదేశీ లీగ్‌లో ఆడకుండా NOC’s సస్పెండ్..!