Tilak Varma : ఒకేఒక్క ఇన్నింగ్స్ చాలు ఒక క్రికెటర్ పేరు చరిత్రలో నిలవడానికి. పదిహేడో సీజన్ ఆసియాకప్ ఫైనల్లో అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడాడు తిలక్ వర్మ (Tilak Varma). టాపార్డర్ కుప్పకూలడంతో… పాకిస్థాన్ ఆటగాళ్లు విజయంపై ధీమాతో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ తెలుగబ్బాయి కలకాలం గుర్తిండిపోయేలా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిని చిత్తు చూస్తూ.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ దాయాదితో బిగ్ ఫైట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
టైటిల్ పోరులో పాకిస్థాన్‌ను 150లోపే కట్టడి చేసిన భారత్ అలవోకగా గెలుస్తుందనుకున్నారంతా. కానీ, ఆరంభంలోనే మూడు వికెట్లు పడడంతో అందరిలో కంగారు మొదలైంది. ‘కుర్రాళ్లు నిలబడుతారా? పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తారా?’ అనే సందేహాల నడుమ ‘నేనున్నాగా’ అంటూ తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ మ్యాచ్ సమయంలో పాక్ క్రికెటర్లు ఏకాగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నించారని నోటికి పనిచెప్పినా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నానని వెల్లడించాడు.
Tilak Varma on Pakistani players bad behaviour 🗣️-
“Pakistani players tried hard and came at us after we were three down, but I stayed calm, played well, and replied perfectly after the win everyone saw it.”pic.twitter.com/tlojS08MlA
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 30, 2025
‘ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్లో పాక్‌పై విజయాన్ని ‘ఆపరేషన్ సిందూర్’గా అభివర్ణించాడు. అయితే.. ‘ఆపరేషన్ తిలక్’ (Operation Tilak) అనడం మాత్రం చాలా పెద్ద విషయం. ఆటలో మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. సరైన సమయంలో నాకు జట్టును గెలిపించే అవకాశం లభించింది. దేశం గర్వపడేలా చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఛేదనలో 20 పరుగులకే మూడు వికెట్లు పడడంతో అందరిలోనూ కొంచెం టెన్షన్ కనిపించింది. అదే అవకాశమని పాక్ ఆటగాళ్లు రెచ్చిపోవాలనుకున్నారు.
Tilak Varma hoisting the tricolour with his coach in Hyderabad.🇮🇳🔥
The future Star @TilakV9 ❤️ pic.twitter.com/gB1BYsFw7f
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 30, 2025
నేను ఒక చెత్త షాట్ ఆడి ఔటయ్యానంటే జట్టు వెనకంజ వేసేలా చేసినట్టే. 140 కోట్ల మంది భారతీయులకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాని మరువలేదు. అందుకే.. ఎలాగైనా టీమ్‌ను గెలిపించాలనుకున్నా. అందుకు ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించాను. పాక్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినా.. బ్యాటుతోనే బదులివ్వాలని అనుకున్నా. మ్యాచ్ గెలిచిన తర్వాత దాయాది ఆటగాళ్లకు వైల్డ్ సెలబ్రేషన్‌తో గట్టిగా రిప్లై ఇచ్చాను. మీరంతా టీవీల్లో చూశారుగా’ అని తిలక్ వెల్లడించాడు. మంగళవారం తిలక్ తన కోచ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని చేతబూని టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
Tilak Varma owned the Pakistani jokers with the bat and pure aggression. They’ll never forget his name.🤫🔥 #INDvsPAK pic.twitter.com/sgUj2Tl66m
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 29, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌ను భారత్ అజేయంగా ముగించింది. లీగ్ దశలో, సూపర్ -4లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. 147 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే మూడు వికెట్లు పడినా తిలక్ వర్మ (69 నాటౌట్) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సంజూ శాంసన్(24, శివం దూబే(33)ల సహకారంతో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తిలక్.. డెత్ ఓవర్లలో తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేశాడీ చిచ్చరపిడుగు. రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన భారత్.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.
🇮🇳🇮🇳🇮🇳❤️ pic.twitter.com/6OaaknFvhk
— Tilak Varma (@TilakV9) September 28, 2025