PCB | యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఒడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ ఓడిపోగా.. భారత క్రికెటర్లు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా నఖ్వీకి ఇబ్బందులు తప్పలేదు. అయితే, ఓటమి తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులు నఖ్వీని వెంటనే బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రతిభావంతులైన ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌కు చెందిన పీటీఐ పార్టీ సీనియర్ నేత మూనిస్ ఎలాహి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు ధైర్యం ఉంటే మొహ్సిన్ నఖ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యక్తి తక్కువ సమయంలో పాక్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశాడని ఆరపించారు. నఖ్వీ నిర్ణయాలు జట్టును బలహీనంగా మార్చాయని.. ఆయనను తక్షణమే తొలగించాలన్నారు. సింధ్ మాజీ గవర్నర్ మొహమ్మద్ జుబైర్ సైతం నఖ్వీని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ అత్యుత్తమ ఆటగాళ్లను నఖ్వీ జట్టు నుంచి తొలగించారని ఆరోపించారు. పాకిస్తాన్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్‌లను నఖ్వీ జట్టు నుంచి తప్పించారని.. వారి స్థానంలో సల్మాన్ ఆఘా, హారిస్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేశారని.. ఈ నిర్ణయం పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని జుజైర్ ఆరోపించారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా నఖ్వీని ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో పోల్చారు. ఆర్మీ చీఫ్ దేశానికి చేస్తున్నట్లుగానే మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్‌కు కూడా చేస్తున్నాడని విమర్శించారు. భారత ఆటగాళ్లు నఖ్వీతో కరచాలనం చేయడానికి, ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించడం ఒక హెచ్చరిక అని జర్నలిస్ట్ ఉమర్ దరాజ్ గొండాల్ పేర్కొన్నారు. హాకీ తరహాలోనే పాకిస్తాన్లో క్రికెట్ పతనమైందని.. నఖ్వీని బిగ్ బాస్‌కి ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఆయనను పీసీబీ చైర్మన్‌గా నియమించారని.. రాజకీయ నియామకాలు ముగిసే వరకు, పాకిస్తాన్ క్రికెట్ మెరుగుపడదంటూ వ్యాఖ్యానించారు.
Read More :
PCB | పాకిస్తాన్ క్రికెటర్లకు షాక్ ఇచ్చిన పీసీబీ.. విదేశీ లీగ్‌లో ఆడకుండా NOC’s సస్పెండ్..!
ట్రోఫీ రచ్చ.. ఏసీసీ చైర్మన్‌పై ఐసీసీకి ఫిర్యాదు!