WCPL 2024 : పొట్టి వరల్డ్ కప్ సందడి ముగిసిందో లేదో టీ20 లీగ్స్‌కు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. అన్నిటి కంటే ముందు మహిళల కరీబియన్ ప్రీమియర్(WCPL 2024) లీగ్ షురూ కానుంది. డబ్ల్యూసీపీఎల్ ఆగస్టు 21న మొదలవ్వనుందని మంగళవారం నిర్వాహకులు వెల్లడించారు. దాంతో, ఈ లీగ్‌లో తలపడనున్న మూడు జట్లు తుది స్క్వాడ్‌ను ప్రకటించాయి.
బ్రియాన్ లారా స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియిన్ బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు ఆరంభ పోరులో ఢీ కొట్టనున్నాయి. ఈ లీగ్‌లో భారత జట్టు నుంచి స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్, పేసర్ శిఖా పాండేలు మాత్రమే ఆడుతున్నారు.
ట్రిన్బగో నైట్ రైడర్స్ : డియాండ్ర డాటిన్, చేడియాన్ నేషన్, కిసియా నైట్, షమిలియా కొన్నెల్, కిషోనా నైట్, ఝాజరా క్లాక్స్టన్, జైదా జేమ్స్, జన్నియెలీ గ్లాస్గో, అనిసా మహమ్మద్, షునెల్లె సాహ్, సమర రామనాథ్, మేగ్ లానింగ్, జెస్ జొనసెన్, జెమీమా రోడ్రిగ్స్, శిఖా పాండే.
గయానా అమెజాన్ వారియర్స్ : హేలీ మాథ్యూస్, చిన్నెల్లె హెన్రీ, అఫి ఫ్లెచర్, అలియాహ్ అల్లెన్నె, రిషదా విలియమ్స్, షబిక గజ్నబీ, చెర్రీ అన్ ఫ్రేజర్, ట్రిషాన్ హోల్డర్, కియాన జోసెఫ్, జెనెబె జోసెఫ్, నైజన్ని కంబెర్బాచ్, చమరి ఆటపట్టు, అమంద జడె వెల్లింగ్టన్, లారా హ్యారిస్, జార్జియా రెడ్యెనే.
బార్బడోస్ రాయల్స్ : స్టఫనీ టేలర్, షెమైనే కాంప్‌బెల్, నటాషా మెక్లీన్, కరిష్మా రమహరాక్, షకీర సెల్మార్. షెనెట గ్రిమ్మండ్, అశిమిని మునిసర్, కేట్ విల్మట్, కైసియా షుట్జ్, నియా లచ్మన్, రీలెన్న గ్రిమ్మండ్, షబ్నిం ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, క్లొయె ట్రయాన్, లారెన్ విన్ఫీల్డ్ హిల్.