ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడీ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పాత్ర పూర్తి నిడివిలో లేకపోయినా కథలో చాలా కీలకమైన పాత్ర కావటంతో అందరిని ఆకర్షించింది. కల్కి 2898ఏడీ విడుదలైన రెండు వారాలకే కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు-2 రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేక పోయింది. శంకర్ దర్శకత్వంలో రూపొందించిన` భారతీయుడు` చిత్రానికి సీక్వెల్ గా విడుదలైన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమా మొదటి భాగమైన భారతీయుడు కి భారతీయుడు -2 కు చాలా వ్యత్యాసం ఉంది.ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా ….నమోదైంది. అయితే భారతీయుడు-2 డిజాస్టర్ అవ్వడం కల్కి కి మళ్లీ కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.
కల్కి సినిమాకు కలెక్షన్లు తగ్గుతున్న సమయంలో భారతీయుడు -2 విడుదలై నెగెటివ్ టాక్ రావడంతో మళ్లీ కల్కీ కలెక్షన్ల్ ఊపందుకున్నాయి. టిక్కెట్ల రేట్లు కూడా సాధారణమైన ధరలోకి రావడంతో ప్రేక్షకులందరూ మరోసారి కల్కిని చూడడానికి ఆసక్తి చూపారు. ఇక ఇప్పుడు కొంత మంది కమల్ హాసన్ కల్కిలో నటించి విజయాన్నిఇస్తే.. మరోసారి తన అపజయం కూడా ప్రభాస్ కు కలిసొచ్చింది అంటున్నారు. సో.. ప్రభాస్ లక్కీచార్మ్ కమల్ హాసన్ అంటూ అందరూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also :
Kanguva | సూర్య కంగువ సాంగ్లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్