Subhash Dandekar | జామెట్రీ క్యామ్లిన్ బాక్స్‌ను కనుగొన్న సుభాష్ దండేకర్ (86) ఇక లేరు. ముంబయిలో సోమవారం తుదిశ్వాస విడువగా.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. నాణ్యమైన స్టేషనరీ, ఎడ్యుకేషన్ ప్రొడక్స్ ఉత్పత్తులకు నిలిచిన క్యామ్లిన్ను 1931లో దిగంబర్ పరశురామ్ దండేకర్ క్యామ్లిన్ను స్థాపించారు. సుభాష్ దండేకర్ కంపెనీని మరింత విస్తరించారు. ‘హార్స్ బ్రాండ్’ ఇంక్ పౌడర్, టాబ్లెట్‌తో ప్రారంభించిన సంస్థ 1946లో ప్రవేటు సంస్థగా మారింది. ఇక 1998లో పబ్లిక్ సంస్థగా మారింది. 1960ల్లో కంపెనీ ఆఫీస్ స్టేషనరీ, ప్రొఫెషనల్ ఆర్టిస్టులకు సంబంధించిన టూల్స్‌ను సైతం ఉత్పత్తి చేసింది. ఆయన తీసుకున్న చొరవ కారణంగా కంపెనీ పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. 2011లో జపనీస్ కొకుయో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం సహా క్యామ్లిన్ ఆయన పదవీకాలంలో ఎన్నో మైలురాళ్లను చూసింది.
ఈ వ్యూహాత్యక భాగస్వామ్యం కుకుయో ఉత్పత్తులను భారత మార్కెట్‌కు పరిచయం చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో క్యామ్లిన్ విస్తరణకు మార్గం సుగమం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉన్నా క్యామ్లిన్ భారతీయులకు ప్రియమైన బ్రాండ్‌గా మిగిలింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లో క్యామ్లిన్ బ్రాండ్ జామెట్రి బాక్స్ కనిపించింది. ఇంటర్నెట్ గురించి పిల్లలకు అంతగా తెలియరి రోజుల్లో జామెట్రి బాక్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. ఇక సుభాష్ దండేకర్ సామాజిక సేవలోనూ పాల్గొన్నారు. 1992 నుంచి 1997 వరకు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్‌గా పని చేశారు. కార్మికులకు గౌరవం, వ్యాపారంలో విలువ పరిరక్షణ కోసం కృషి చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరాఠీ పరిశ్రమకు ఖ్యాతిని తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు. సుభాష్ దండేకర్ క్యామ్లిన్తో ఉపాధి కల్పించడంతో పాటు వేలాది మంది యువత జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేశారని.. విలువల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.