RCB | ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘ఈ సాలా కప్ నమదే’ నినాదంతో ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. 18వ సీజన్లో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశ నుంచి అదరగొట్టిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై అద్బుత విజయంతో అంతిమ పోరుకు అర్హత సాధించింది. దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఆర్సీబీ తుది పోరుకు అర్హత సాధించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందాలకు అవధుల్లేవు. ఈ సారి ఎలాగైన జట్టు గెలుస్తుందన్న ధీమాతో ఉన్నారు.
గురువారం మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి చేశారు. జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించారు. తమ అభిమాన క్రికెటర్‌కు ఛీరప్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి ప్రదర్శించిన ప్లకార్డ్ ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఫైనల్లో ఆర్సీబీ జట్టు గెలవకపోతే తన భర్తకు విడాకులు ఇచ్చేస్తా (Divorce Husband) అంటూ పేర్కొంది. ‘ఈ సారి ఫైనల్లో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవకపోతే.. నా భర్తకు విడాకులు ఇస్తా’ అంటూ ప్లకార్డును ప్రదర్శించింది. దానిపై ‘కింగ్ కోహ్లీ’ హ్యాష్‌ట్యాగ్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 29, 2025
Also Read..
RCB | ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే పబ్లిక్ హాలిడే ప్రకటించాలి.. సీఎం సిద్ధరామయ్యకు ఫ్యాన్స్ విజ్ఞప్తి
RCB | అదరగొట్టిన ఆర్సీబీ.. తొమ్మిదేండ్ల తర్వాత తుది పోరుకు బెంగళూరు
IPL 2025 | నాలుగోసారి ఫైనల్లో ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమదే..!