RCB | ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘ఈ సాలా కప్ నమదే’ నినాదంతో ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. 18వ సీజన్లో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశ నుంచి అదరగొట్టిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై అద్బుత విజయంతో అంతిమ పోరుకు అర్హత సాధించింది. దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఆర్సీబీ తుది పోరుకు అర్హత సాధించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందాలకు అవధుల్లేవు. ఈ సారి ఎలాగైన జట్టు గెలుస్తుందన్న ధీమాతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమాని ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. బెలగావి జిల్లాకు చెందిన శివానంద్ మల్లనావర్ (Shivanand Mallannavar) ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ఈసారి ఫైనల్లో బెంగళూరు జట్టు గెలిస్తే ఆ రోజును కర్ణాటక ప్రభుత్వం సెలవు దినంగా (state holiday) ప్రకటించాలని సీఎంను కోరారు. అంతేకాదు ప్రతి ఏటా ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలన్నారు. ఆర్సీబీ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. అదరగొట్టింది. తమ చిరకాల కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోరును కీలకమైన ప్లేఆఫ్స్‌లోనూ కొనసాగిస్తూ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది. వార్ వన్‌సైడ్ అన్నట్లు ఏకపక్షంగా సాగిన పోరులో ఆర్సీబీ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఘన విజయంతో 2016 తర్వాత తొలిసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2009, 2011, 2016లో బెంగళూరు తుది పోరుకు అర్హత సాధించింది. అయితే, ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు.
Also Read..
RCB | అదరగొట్టిన ఆర్సీబీ.. తొమ్మిదేండ్ల తర్వాత తుది పోరుకు బెంగళూరు
IPL 2025 | నాలుగోసారి ఫైనల్లో ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమదే..!
IPL 2025 | చితక్కొట్టిన సాల్ట్.. పంజాబ్‌కు చెక్ పెడుతూ ఫైనల్లో ఆర్సీబీ