IPL 2025 : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆ జట్టు ఫేవరెట్. స్వదేశీ స్టార్లు, విదేశీ హిట్టర్లు.. ఇలా జట్టునిండా మ్యాచ్ విన్నర్లే. మూడుసార్లు ఫైనల్ చేరినా.. 17 ఏళ్లుగా ఆ జట్టుకు ట్రోఫీ మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షనే. ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్‌తో ప్రతి ఎడిషన్‌లో ఆడే ఆ టీమ్ కల.. అందరి అభిమానులు కల సాకారమయ్యే రోజు రాబోతోంది. 18వ ఎడిషన్‌లో అంచనాలకు మించి రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. తమ ఫేవరెట్ టీమ్ ఈసారి కప్ కొట్టడం పక్కా అని సంబురాల్లో మునిగిపోతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఒక విఫలమైన జట్టు. అందరూ ప్రతిభావంతులే ఉన్నా సరే ఎందుకనో బెంగళూరును దురదృష్టం వెంటాడుతూ వచ్చేది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్లోనూ పరాజయమే పలకరించింది. రన్నరప్ అనే పేరుతోనే సరిపెట్టుకుంది. టీమిండియాను టెస్టుల్లో నంబర్ 1గా నిలిపిని విరాట్ కోహ్లీ (Virat Kohli).. కెప్టెన్‌గా ఉన్నా సరే బెంగళూరు ట్రోఫీ కరువు తీర్చలేకపోయాడు. 17వ సీజన్‌కు ముందే సారథిగా వైదొలిగిన విరాట్.. బ్యాటర్‌గా జట్టుకు మరింత ఉపయోగపడాలనుకున్నాడు. అనుకున్నట్టే 18వ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో 8 అర్ధ శతకాలు, 602 రన్స్ కీలక పాత్ర పోషించాడీ రన్ మెషీన్.
ಇದು ನಮ್ಮ ಅಭಿಮಾನಿ ದೇವ್ರುಗಳಿಗೆ! 🙏 pic.twitter.com/NxOBwNil2Q
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
గత 17 ఏళ్లుగా ఆర్సీబీ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న కోహ్లీ .. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(387 రన్స్)తో కలిసి మెరుపు ఆరంభాలు ఇస్తూ ఛేజ్ మాస్టర్‌గా తన ముద్ర వేశాడు కింగ్ కోహ్లీ. ఇక బౌలింగ్ యూనిట్లో పేసర్లు హేజిల్‌వుడ్ (18 వికెట్లు), భువనేశ్వర్(15 వికెట్లు) పవర్ ప్లే, డెత్ ఓవర్లలో నిప్పులు చెరగగా .. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా.. గత సీజన్లో మాదిరిగా ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆర్సీబీ.. క్వాలిఫయర్ 1లోనూ అదే ఫార్ములాను అనుసరించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్‌ను 101కే కట్టడి చేసి సగం మ్యాచ్ గెలిచేసిన బెంగళూరు.. సాల్ట్ అజేయ అర్ధ శతకంతో 10 ఓవర్లలోనే జయభేరి మోగించింది.
Full scenes guru. 😍
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
దాంతో, ఈసారి ఎలాగైనా తమ జట్టు కప్‌ను ఒడిసిపట్టడం ఖాయమని ఆర్సీబీ అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు. ఒకవేళ ఈ అవకాశం చేజారితే మళ్లీ.. కొన్ని సీజన్లు నిరీక్షించాల్సి వస్తుందని వాళ్ల ఆందోళన. ఎందుకంటే.. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ ఐపీఎల్‌కు త్వరలోనే వీడ్కోలు పలకవచ్చు. సో.. ఆరంభ సీజన్ నుంచి బెంగళూరుకే ఆడుతున్న ఈ లెజెండరీ ఆటగాడి కల నెరవేరాలని మనసారా కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సాలా కప్ నమదే నినాదంతో ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. 18వ సీజన్లో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశ నుంచి అదరగొట్టిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై అద్బుత విజయంతో అంతిమ పోరుకు అర్హత సాధించింది. ముల్లనూర్‌లో హేజిల్‌వుడ్(3-21), సుయాశ్ శర్మ(3-17)ల ధాటికి పంజాబ్ 101కే పరిమితమైంది.
What a time to reach the milestone 👊
Phil Salt is leading #RCB‘s chase into the #TATAIPL 2025 Finals ❤
Updates ▶ https://t.co/FhocIrg42l#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile pic.twitter.com/xnP1qWSgJa
— IndianPremierLeague (@IPL) May 29, 2025
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఫిలిప్ సాల్ట్(56 నాటౌట్) మెరుపు వేగంతో అర్థ శతకం బాదాడు. ముషీర్ ఖాన్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రజత్ పాటిదార్(15 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించగా ఆర్సీబీ నాలుగో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. సమిష్టి వైఫల్యంతో ఓటమి పాలైన అయ్యర్ సేనకు మరొక అవకాశముంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ 2లో పంజాబ్ తలపడనుంది.