IPL 2025 : స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(12) రెండు బౌండరీలతో చెలరేగాడు. అయితే.. అతడిని ఔట్ చేసిన జేమీసన్ పంజాబ్‌కు బ్రేకిచ్చాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయిన విరాట్ వికెట్ కీపర్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్(5 నాటౌట్) ఆ ఓవర్లో అతికష్టమ్మీద వికెట్ కాపాడుకున్నాడు.
అనతంరం ఒమర్జాయ్ ఓవర్లో ఆఖరి బంతిని గల్లీలో బౌండరీ దాటించిన మయాంక్ ఆర్సీబీ స్కోర్ 40 దాటించాడు. జేమీసన్ వేసిన 6వ ఓవర్ తొలి బంతికే మయాంక్ స్ట్రెయిట్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత నాలుఓగ బంతిని ఫిలిప్ సాల్ట్(40 నాటౌట్) కవర్స్‌లో ఫోర్‌గా మలిచాడు. లెగ్ సైడ్ మళ్లీ ఫోర్.. చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 61 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా బెంగళూరు విజయానికి 41 పరుగులు కావాలి.
#RCB start strongly 👏
But #PBKS strike back with the MASSIVE wicket of Virat Kohli 🔥
Will they mount a comeback?
Updates ▶ https://t.co/FhocIrg42l#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/MOpZq5nX4U
— IndianPremierLeague (@IPL) May 29, 2025