IPL 2025 : ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘ఈ సాలా కప్ నమదే’ నినాదంతో ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. 18వ సీజన్లో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశ నుంచి అదరగొట్టిన బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై అద్బుత విజయంతో అంతిమ పోరుకు అర్హత సాధించింది. 102 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించిందిన ఆర్సీబీ.. తొలి ట్రోఫీకి మరింత చేరువైంది.
ముల్లనూర్‌లో హేజిల్‌వుడ్(3-21), సుయాశ్ శర్మ(3-17)ల ధాటికి పంజాబ్ 101కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఫిలిప్ సాల్ట్(56 నాటౌట్) మెరుపు వేగంతో అర్థ శతకం బాదాడు. ముషీర్ ఖాన్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రజత్ పాటిదార్(15 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించగా ఆర్సీబీ నాలుగో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. సమిష్టి వైఫల్యంతో ఓటమి పాలైన అయ్యర్ సేనకు మరొక అవకాశముంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ 2లో పంజాబ్ తలపడనుంది.
Say Hello to the first 𝐅𝐈𝐍𝐀𝐋𝐈𝐒𝐓𝐒 of #TATAIPL 2025 ❤#RCB fans, how elated are you? 🤩
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/gmnjZsFWxF
— IndianPremierLeague (@IPL) May 29, 2025
బౌలర్ల విజృంభణతో పంజాబ్‌ను 101కే కట్టడి చేసిన స్వల్ప ఛేదనలో ఆర్సీబీ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(12) రెండు బౌండరీలతో చెలరేగాడు. అయితే.. అతడిని ఔట్ చేసిన జేమీసన్ పంజాబ్‌కు బ్రేకిచ్చాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయిన విరాట్ వికెట్ కీపర్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్(5 నాటౌట్) ఆ ఓవర్లో అతికష్టమ్మీద వికెట్ కాపాడుకున్నాడు. అనతంరం ఒమర్జాయ్ ఓవర్లో ఆఖరి బంతిని గల్లీలో బౌండరీ దాటించిన మయాంక్ ఆర్సీబీ స్కోర్ 40 దాటించాడు.
జేమీసన్ వేసిన 6వ ఓవర్ తొలి బంతికే మయాంక్ స్ట్రెయిట్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత నాలుగో బంతిని ఫిలిప్ సాల్ట్(56 నాటౌట్) కవర్స్‌లో ఫోర్‌గా మలిచాడు. లెగ్ సైడ్ మళ్లీ ఫోర్.. చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 61 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో రెచ్చిఓయిన మయాంక్ వరుసగా 6, 4 కొట్టి.. ఆ తర్వాత బంతికి వికెట్ల వెనకాల అయ్యర్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికీ బెంగళూరు విజయానికి 18 పరుగులు కావాలంతే. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ముషీర్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన రజత్ పాటిదార్(15 నాటౌట్) .. అదే ఓవర్లో సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన ఆర్సీబీ.. దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
𝐈 𝐍 𝐓 𝐎 𝐓 𝐇 𝐄 𝐅 𝐈 𝐍 𝐀 𝐋!!! 🥹 pic.twitter.com/wacgly4YKq
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
లీగ్ దశలో 9 విజయాలతో దుమ్మురేపిన పంజాబ్ కింగ్స్ కీలకమైన క్వాలిఫయర్ 1 పోరులో తడబడింది. ముల్లనూర్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు హేజిల్‌వుడ్(3-21), యశ్ దయాల్(2-26) నిప్పులు చెరగగా.. వాళ్లను ఎదుర్కోవడం ‘మా వల్ల కాదంటూ’ ఆ జట్టు పవర్ హిట్టర్లు బ్యాట్లెత్తేశారు. ఈ సీజన్ భీకర ఫామ్‌లో ఉన్న పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(5)ను ఔట్ చేసిన యశ్ దయాల్ ఆర్సీబీకి తొలి బ్రేకిచ్చాడు. అక్కడితో మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూ వచ్చింది. కాసేపటికే డేంజరస్ ప్రభ్సిమ్రాన్ సింగ్(18)ను భువనేశ్వర్ పెవిలియన్ పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హేజిల్‌వుడ్ తన పేస్ పవర్ చూపిస్తూ.. శ్రేయస్ అయ్యర్(2)ను ఔట్ చేశాడు. అంతే.. 30 పరుగులకే మూడు కీలక వికెట్లు పడ్డాయి. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్న వేళ జోష్ ఇంగ్లిస్(0) ధనాధన్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, హేజిల్‌వుడ్ అతడిని ఊరించే బంతితో పెవిలియన్ పంపాడు. అంతే.. చూస్తుండగానే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్.
ఆర్సీబీ పేసర్ల ధాటికి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను సయాశ్ శర్మ(3-17) మరింత దెబ్బకొట్టాడు. పవర్ ప్లే అనంతరం యుకెరటం నేహల్ వధేరా(6)ను దయాల్ ఔట్ చేయగా 60కే పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆర్వాత బంతి అందుకున్న ఈ స్పిన్నర్.. శాశాంక్ సింగ్(3)ను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ.. మార్కస్ స్టోయినిస్(26), అజ్మతుల్లా ఒమర్జాయ్(18)లు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాలనుకున్నారు. కానీ, స్టోయినిస్‌ను బౌల్డ్ చేసిన సుయాశ్ వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్(4)ను షెపర్డ్ వెనక్కి పంపగా.. చివరి వికెట్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్(18)ను హేజిల్‌వుడ్ ఔట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
No doubt. No debates. Suyash is UNPLAYABLE. 🔥 pic.twitter.com/do7jJyIaOA
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025