IPL 2025 : క్వాలిఫయర్ 1 పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. ఆతిథ్య పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను వణికిస్తూ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. పవర్ ప్లేలోనే పేసర్లు హేజిల్‌వుడ్(3-21), యశ్ దయాల్(2-26) నిప్పులు చెరగగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ(3-17) తిప్పేశాడు. దాంతో, ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్న పంజాబ్ హిట్టర్లు వరసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 50కే ఐదు వికెట్లు పడిన పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మార్కస్ స్టోయినిస్(26).. ఆఖర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్(18)లు పోరాడారు. కానీ, అజ్మతుల్లాను ఔట్ చేసిన హేజిల్‌వుడ్ పంజాబ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 14.1 ఓవర్‌కు అయ్యర్ సేన 101 పరుగులకు ఆలౌటయ్యింది. తొలి కప్ వేటలో ఉన్న ఆర్సీబీ భారీ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లడం ఇక లాంఛనమే.
లీగ్ దశలో 9 విజయాలతో దుమ్మురేపిన పంజాబ్ కింగ్స్ కీలక పోరులో తడబడింది. ముల్లనూర్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను ఎదుర్కోవడం మా వల్ల కాదంటూ ఆ జట్టు పవర్ హిట్టర్లు బ్యాట్లెత్తేశారు. ఈ సీజన్ భీకర ఫామ్‌లో ఉన్న పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(5)ను ఔట్ చేసిన యశ్ దయాల్ ఆర్సీబీకి తొలి బ్రేకిచ్చాడు. అక్కడితో మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూ వచ్చింది. కాసేపటికే డేంజరస్ ప్రభ్సిమ్రాన్ సింగ్(18)ను భువనేశ్వర్ పెవిలియన్ పంపాడు.
BOWLED HIM x 2⃣ \|/
Suyash Sharma scalps two HUGE wickets with two brilliant wrong ‘uns 👏#RCB are pumped up! 💪
Updates ▶ https://t.co/FhocIrg42l#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/1gscWKzFr2
— IndianPremierLeague (@IPL) May 29, 2025
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హేజిల్‌వుడ్ తన పేస్ పవర్ చూపిస్తూ.. శ్రేయస్ అయ్యర్(2)ను ఔట్ చేశాడు. అంతే.. 30 పరుగులకే మూడు కీలక వికెట్లు పడ్డాయి. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్న వేళ జోష్ ఇంగ్లిస్(0) ధనాధన్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, హేజిల్‌వుడ్ అతడిని ఊరించే బంతితో పెవిలియన్ పంపాడు. అంతే.. చూస్తుండగానే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్.
ఆర్సీబీ పేసర్ల ధాటికి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను సయాశ్ శర్మ(3-17) మరింత దెబ్బకొట్టాడు. పవర్ ప్లే అనంతరం యుకెరటం నేహల్ వధేరా(6 )ను దయాల్ ఔట్ చేయగా 60కే పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆర్వాత బంతి అందుకున్న ఈ స్పిన్నర్.. శాశాంక్ సింగ్(3)ను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ.. మార్కస్ స్టోయినిస్(26), అజ్మతుల్లా ఒమర్జాయ్()లు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాలనుకున్నారు.
Double strike, ft. Suyash 🔥
More joy for #RCB, another setback for #PBKS
Will Marcus Stoinis lead a major comeback? 👊
Updates ▶ https://t.co/FhocIrg42l#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/REZdx5rspn
— IndianPremierLeague (@IPL) May 29, 2025
కానీ, స్టోయినిస్‌ను బౌల్డ్ చేసిన సుయాశ్ వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్(4)ను షెపర్డ్ వెనక్కి పంపగా.. చివరి వికెట్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్(18)ను హేజిల్‌వుడ్ ఔట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ సీజన్లో కోల్‌కతాపై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న అయ్యర్ సేన.. ఆర్సీబీ బ్యాటర్లను అడ్డుకుంటుందా? అనేది సందేహమే. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే.. పంజాబ్ జట్టు క్వాలిఫయర్ 2లో ఆడాల్సి వస్తుంది.