Petra Qvitova : రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ పెట్రా క్విటోవా (Petra Qvitova) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున గ్రాండ్‌స్లామ్ టోర్నీ షురూ కానుందనగా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈసారి వింబుల్డన్ టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తను.. సుదీర్ఘ కెరియర్‌కు చరమగీతం పాడుతున్నానని తెలిపింది. ఈ ఏడాది తన కెరియర్ను ముగిస్తున్నానని.. సెప్టెంబర్‌లో వీడ్కోలు మ్యాచ్ ఆడుతానని వెల్లడించిందీ మాజీ వరల్డ్ నంబర్ 2.
రిటైర్మెంట్ విషయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది క్విటోవా. ‘మరొకసారి వింబుల్డన్ ఛాంపియన్షిప్ ఆడడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నా కెరియర్లో ఎంతో అందమైన జ్ఞాపకాల్ని పోగేసుకున్న టోర్నీ ఇది. అయితే.. యూఎస్ ఓపెన్ నాకు ఆఖరిది. అక్కడి హార్డ్ కోర్టులో నా ఆట ఎలా ఉండనుంది? అనేది నేను ఇప్పుడే చెప్పలేను. సో.. యూఎస్ ఓపెన్‌తోనే రాకెట్ వదిలేద్దామని అనుకుంటున్నా’ అని 35 ఏళ్ల క్విటోవా తెలిపింది.
Six career titles on grass for our two-time champion @Petra_Kvitova
🏆 2011 Wimbledon
🏆 2014 Wimbledon
🏆 2017 Birmingham
🏆 2018 Birmingham
🏆 2022 Eastbourne
🏆 2023 @bett1open pic.twitter.com/nxaCXts7GV— Wimbledon (@Wimbledon) June 26, 2023
జూన్ 30న వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆలోపే క్విటోవా వీడ్కోలు వార్తతో అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఆమె ర్యాంక్ 572. చెక్ రిపబ్లిక్కు చెందిన క్విటోవా మహిళల సింగిల్స్‌లో అత్యుత్తమంగా రెండో ర్యాంక్ సాధించింది. తమ దేశం ప్రతిష్ఠాత్మక ఫెడరేషన్ కప్ (ప్రస్తుతం బిల్లీ జీన్ కింగ్ కప్‌గా పిలుస్తున్నారు)లో ఆరు టైటిళ్లు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ టెన్నిస్ బ్యూటీ రెండేళ్ల క్రితం వింబుల్డన్ టోర్నీలో ఆడింది. నిరుడు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ జరుగుతున్న సమయంలోనే క్విటోవా తొలిసారి తల్లి అయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 17 నెలల విరామం తీసుకున్న తను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ కోర్టులో అడుగుపెట్టింది.
🏆 Champion in Berlin 🏆@Petra_Kvitova defeats Vekic 6-2. 7-6(6) for her 31st career title! #bett1open pic.twitter.com/g0rkeyTYMC
— wta (@WTA) June 25, 2023