ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో గల చింతలపేట దత్తాత్రేయ స్వామి ( Dattatreya Temple ) ఆలయానికి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 32 వ వార్డు మాజీ కౌన్సిలర్ జిందం మణి, లక్ష్మీనారాయణ దంపతులు గురువారం కిలో వెండి ( Silver) విరాళంగా (Donation) అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అర్చకుడు రాజశేఖర్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతనమైన ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు మాసుల రాజేశ్వర్, బూరుగుల నాగేష్, పుప్పాల చిన్న నర్సయ్య, భక్తులు ఉన్నారు.