Rahul Gandhi birthday | పోతంగల్ జూన్ 19: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్, నాయకులు గంధపు పవన్, చాంద్ పాషా, రాజు, మన్సూర్, కేశ వీరేశం, షేరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.