శుక్రవారం 03 జూలై 2020
Sports - May 22, 2020 , 20:15:38

కేన్‌కు కోహ్లీ స‌ర్టిఫికెట్‌

కేన్‌కు కోహ్లీ స‌ర్టిఫికెట్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌తో క‌లిసి టాస్ వేసేందుకు మైదానంలోకి వెళ్తున్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పెట్టిన కోహ్లీ దీనికి `మా మ‌ధ్య సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. విల‌య‌మ్స‌న్ మంచి వ్య‌క్తి` అని వ్యాఖ్య జోడించాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. కాగా. వీరిద్ద‌రు మంచి మిత్రుల‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. మైదానంలో ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డే వీళ్లిద్ద‌రూ గతేడాది ఓ మ్యాచ్ సంద‌ర్భంగా బౌండ్రీ రోప్ ప‌క్క‌న కూర్చొని మ్యాచ్ చూస్తూ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. 

గతేడాది ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో టీమ్ఇండియా న్యూజిలాండ్ చేతిలోనే ఓట‌మి పాలై ఇంటిదారిప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే కేన్‌, కోహ్లీ మ‌ధ్య స్నేహం ఈ నాటిది కాదు. 2008 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లోనే వీరిద్ద‌రూ విరోధులుగా త‌ల‌ప‌డ్డారు. అప్ప‌ట్లో యువ భార‌త్‌కు విరాట్ సార‌థ్యం వ‌హిస్తే.. న్యూజిలాండ్‌కు విలియ‌మ్స‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ టోర్నీ సెమీఫైన‌ల్లో విలియ‌మ్స‌న్‌ను ఔట్ చేసింది కూడా కోహ్లీనే కావ‌డం గ‌మ‌నార్హం. 


logo