Kane Williamson | టెస్టుల్లో 31వ సెంచరీ.. ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొట్టేస్తాడా..!
Kane Williamson : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్(Test Series)లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) శతకాల మోత మోగిస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులువుగా మూడంకెల స్కోర్ చేస్తూ రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. బే ఓవల్(Bay Oval)లో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో..
Kane Williamson : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్(Test Series)లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) శతకాల మోత మోగిస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులువుగా మూడంకెల స్కోర్ చేస్తూ రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. బే ఓవల్(Bay Oval)లో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన విలియమ్సన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ వంద కొట్టాడు.
సఫారీ కుర్ర పేస్ దళాన్ని చీల్చిచెండాడుతూ 132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 రన్స్ బాదాడు. తద్వారా ఈ స్టార్ ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్లో 31వ సెంచరీ నమోదు చేశాడు. దాంతో, టెస్టుల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
Two types of hundreds served up Kane Wiliiamson 💯💯
First time he’s scored tons twice in a Test, and the fifth from New Zealand 🙌#NZvSA pic.twitter.com/KkBaqMOaV4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2024
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (D0n Bradman)తో పాటు ఫ్యాబ్ 4లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బ్రేక్ చేసిన విలియమ్సన్.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డను బ్రేక్ చేశాడు. మరొక సెంచరీ కొడితే ఈ కివీస్ మాజీ సారథి ..ఆస్ట్రేలియా రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ (Steven Smith) సరసన నిలుస్తాడు. ప్రస్తుతం స్మిత్ 32 శతకాలతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
విలియమ్సన్, స్టీవ్ స్మిత్

బే ఓవల్ టెస్టులో టామ్ లాథమ్(20), డెవాన్ కాన్వే(1)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. రచిన్ రవీంద్ర(240) డబుల్ సెంచరీతో విజృంభించగా.. విలియమ్సన్(118) సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం సఫారీలను 162 పరుగులకే చుట్టేసిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. విలియమ్సన్ సెంచరీతో న్యూజిలాండ్ ఆధిక్యం 500 దాటింది.
Seems like a morning declaration’s imminent after that KW special #NZvSA
👉 https://t.co/xugsbQLZxX pic.twitter.com/MZyOdk7ftW
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2024
మూడో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 179 రన్స్ కొట్టింది. టామ్ బండెల్ 5 నాటౌట్,, డారిల్ మిచెల్(11 నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతానికి కివీస్ 528 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. కుర్రాళ్లతో నిండిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు అద్భుతం చేస్తే తప్ప ఓటమిని నుంచి బయటపడడం కష్టం.
ఇవి కూడా చదవండి
- IPL Captains | ఐపీఎల్ కెప్టెన్లలో రాహులే సంపన్నుడు.. ఆ తొమ్మిదిమంది ఆదాయం ఎంతంటే..?
- MLC Kavitha | భువనగిరి ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత..
- Varun Kumar | లైంగిక ఆరోపణలు.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు నమోదు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

