MLC Kavitha | భువనగిరి ఎస్సీ హాస్టల్ను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత..
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
భువనగిరి: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు. వారి సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు. హాస్టల్ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు. హాస్టల్కు తరచూ బయటి వ్యక్తులు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

