IPL Captains | ఐపీఎల్ కెప్టెన్లలో రాహులే సంపన్నుడు.. ఆ తొమ్మిదిమంది ఆదాయం ఎంతంటే..?
IPL Captains : ప్రపంచంలోని టీ20 లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంత పాపులరో తెలిసిందే. 16 సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా లీగ్ త్వరలోనే షురూ కానుంది. గెలుపు గుర్రాల కోసం కోట్లు కుమ్మరించేందుకు వెనుకాడని ఫ్రాంఛైజీలు సారథులకు భారీగానే డబ్బులు....
IPL Captains : ప్రపంచంలోని టీ20 లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంత పాపులరో తెలిసిందే. 16 సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా లీగ్ త్వరలోనే షురూ కానుంది. అశేష ప్రేక్షకాదరణ కలిగిన ఈ లీగ్ 17వ సీజన్‌ను మార్చి 22న టోర్నీని ప్రారంభించేందుకు బీసీసీఐ(BCCI) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? గెలుపు గుర్రాల కోసం కోట్లు కుమ్మరించేందుకు వెనుకాడని ఫ్రాంఛైజీలు సారథులకు భారీగానే డబ్బులు ముట్టజెప్పుతున్నాయి.
ఐపీఎల్ 10 జట్లలో కెప్టెన్‌గా అత్యధికంగా ఆర్జిస్తున్నది ఎవరో తెలుసా..? కేఎల్ రాహుల్ (KL Rahul). ఈ స్టార్ ఆటగాడికి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ ఏకంగా రూ. 17 కోట్లు కోట్లు చెల్లిస్తోంది. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రాహుల్ లక్నోను రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
కేఎల్ రాహుల్

గతంలో రాయల్ చాలెంజర్స్ (RCB) సారథిగా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా రూ. 17 కోట్లు అందుకున్నాడు. నిరుడు కెప్టెన్‌గా వైదొలిగాక విరాట్ ప్రతి సీజన్‌కు రూ. 15 కోట్లు ముడుతున్నాయి.రాహుల్ తర్వాత పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నకెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant). ఈ డాషింగ్ బ్యాటర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లు చెల్లిస్తోంది.
రిషబ్ పంత్

అయితే.. రెండేండ్ల కింద కారు యాక్సిండెట్తో ఆటకు దూరమైన పంత్ 16వ సీజన్లో ఆడలేదు. ఈమధ్యే కోలుకున్న ఈ చిచ్చరపిడుగు 17వ సీజన్లో ఢీల్లీ కెప్టెన్‌గా పునరామనం చేయనున్నాడు. 17వ సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యా (Hardhki Pandya) రూ.15 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ధోనీకి రూ. 12 కోట్లు
పదిహేనో సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ శాంసన్ (SanjuSamson)కు మేనేజ్మెంట్ ఏకంగా రూ. 12 కోట్లు ఇస్తోంది. మరోవైపు భారత లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా రూ. 12 కోట్లు ఆర్జిస్తున్నాడు.
ధోనీ, సంజూ శాంసన్

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తిరిగి ఎంపికైన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) రూ.12.25 కోట్లు అందుకోనున్నాడు. పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)రూ.8 కోట్లు, ఆర్సీబీ నాయకుడు ఫాఫ్ డూప్లెసిస్ రూ. 7 కోట్లు ఆర్జిస్తున్నారు. 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నడిపించిన ఎడెన్ మర్క్రమ్ రూ.2.6 కోట్లుకు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- IPL 2024 | పదిహేడో సీజన్లో ఆరెంజ్ ఆర్మీకి కొత్త కెప్టెన్.. ఆ ఇద్దరిలో ఎవరంటే..?
- King Charles | కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ
- Uttar Pradesh: మొబైల్లో పోర్న్ క్లిప్ చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హత్య చేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

