IPL 2024 | పదిహేడో సీజన్లో ఆరెంజ్ ఆర్మీకి కొత్త కెప్టెన్.. ఆ ఇద్దరిలో ఎవరంటే..?
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ఇంకా దాదాపు నెల రోజులే ఉంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా..
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ఇంకా దాదాపు నెల రోజులే ఉంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) ఈసారి టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 16వ సీజన్ వైఫల్యంతో మేల్కొన్న ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇప్పటికే హెడ్‌కోచ్‌ను మార్చేసింది.
అంతేకాదు 17వ సీజన్లో హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో ఆడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 16వ సీజన్లో సారథిగా వ్యవహరించిన ఎడెన్ మర్క్రమ్(Aiden Markram)పై వేటు పడే చాన్స్ ఉంది. అదే జరిగితే.. కొత్త కెప్టెన్ రేసులో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar)లు ముందు వరుసలో ఉంటారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఈ స్వింగ్ బౌలర్ 2013 నుంచి ఎస్ఆర్హెచ్కు ఆడుతున్నాడు.
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీతో కమిన్స్

మరోవైపు ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్‌గా గొప్ప రికార్డు ఉంది. అతడి నేతృత్వంలో ఆసీస్ నిరుడు వన్డే వరల్డ్ కప్(ODI World Cup)తో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) గదను సైతం ఎగరేసుకుపోయింది. అందుకనే వేలంలో అతడి కోసం ఏకంగా రూ.20.50 కోట్లు పెట్టింది. వరల్డ్ కప్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (Travis Head) కూడా హైదరాబాద్ కొన్నది. దాంతో, ఈసారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 23 నుంచి మొదలవ్వనుంది.

వైఫల్యానికి కారణాలనేకం..
పదహారో సీజన్లో హైదరాబాద్ జట్టు ఓటమికి ఓపెనింగ్ జోడీ కుదరకపోడం, మిడిలార్డర్ చేతులెత్తేయడం, బౌలింగ్ యూనిట్ సమిష్టి వైఫల్యం.. ఇలా కారణాలు చాలానే. డేవిడ్ వార్నర్‌ను వదిలేయడంతో హైదరాబ్కు ఓపెనర్ దొరకడం పెద్ద సమస్య అయింది. కుర్రాడు అభిషేక్ శర్మ(Abhishek Sharma) తప్పిస్తే.. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓపెనర్‌గా భరోసా ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ జట్టులో టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించింది హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడిని ఎస్ఆర్హెచ్ వేలంలో రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. రెండు అర్ధ శతకాలు బాదిన అతను ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీపై సెంచరీ(104)తో కదం తొక్కాడు.
హెన్రిచ్ క్లాసెన్

క్లాసెన్ మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రైక్ రేటుతో 448 రన్స్ బాదాడు. మరోవైపు రూ.13.25 కోట్లు పలికిన ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈడెన్స్ గార్డెన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై శతకం తప్పితే అతను ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వరుసగా 8 మ్యాచుల్లో రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు.
హ్యారీ బ్రూక్

చివరకు అతడిని బెంచ్‌పై ఉంచి న్యూజిలాండ్ ఆల్‌రౌడర్ గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఆడించాల్సి వచ్చింది. అయినా సరే ప్లే ఆఫ్స్ రేసులో హైదరాబాద్ ఆమడ దూరంలో నిలిచింది. జట్టు ప్రదర్శనతో నిరాశకు గురైన మేనేజ్మెంట్ బ్రియాన్ లారాను తప్పించి, డానియల్ వెటోరీని హెడ్‌కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- MLC Kavitha | ముందుగా సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదుచేయాలి..: ఎమ్మెల్సీ కవిత
- Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్.. రిలీజైన లాల్ సలామ్ ట్రైలర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

