Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్.. రిలీజైన లాల్ సలామ్ ట్రైలర్
Lal Salaam trailer: మొయిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్ .. సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. లాల్ సలామ్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రజినీ కూతురు ఐశ్వర్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈనెల 9వ తేదీన లాల్ సలామ్ ఫిల్మ్ రిలీజ్‌కానున్నది.
చెన్నై: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్(Lal Salaam Trailer) చిత్రానికి చెందిన తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఫిల్మ్‌లో హీరో పాత్రలను పోషిస్తున్నారు. తలైవా రజినీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. స్పోర్ట్స్ కథాంశంతో తీసిన ఈ చిత్రాన్ని వాస్తవానికి పొంగల్ పండుగకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదావేశారు.
https://www.youtube.com/watch?v=-lpb8tNFvYA
మతం, రాజకీయం, క్రికెట్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఫిల్మ్‌లో విక్రాంత్, విష్ణు విశాల్ క్రికెటర్లు. ట్రైలర్లో ఓ దశలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా కనిపిస్తారు. లైకా ప్రొడక్సన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుభాస్కరన్ దీన్ని ప్రజెంట్ చేశారు. మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నారు. క్రికెట్, ఫ్రెండ్షిప్ ప్రధాన కథాంశంగా సాగనున్నది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ ఫిల్మ్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ముంబై, చెన్నై, పుదుచ్చరిల్లో ఎక్కువ భాగాన్ని షూట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

