Uttar Pradesh: మొబైల్లో పోర్న్ క్లిప్ చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హత్య చేశాడు
Uttar Pradesh: మొబైల్ ఫోన్లో పోర్న్ క్లిప్ చూశాడు.. ఆ టెన్షన్లో ఇంట్లో ఉన్న మైనర్ సోదరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చెల్లెల్ని రేప్ చేసిన అతను.. భయంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన యూపీలోని కస్గంజ్లో జరిగింది.
కస్గంజ్: యూపీ(Uttar Pradesh)లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదర్ని రేప్ చేసి హత్య చేశాడు. కస్గంజ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సంజూ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసిన తర్వాత తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంట్లో చెబుతుందన్న భయంతో సోదర్ని అతను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ విషయాలు వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు. పటియాలీ కొత్వాలి ఇంచార్జ్ ఎస్ఐ గోవింద్ బల్లబ్ శర్మ దర్యాప్తు అంశాలను ప్రకటించారు. తన మేనల్లుడి గురించి అతని మామ ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.
ఫిబ్రవరి 4వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలించారు. సోమవారం సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సంజూ తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. తల్లి, సోదరితో కలిసి అతను జీవిస్తున్నాడు. అయితే అఘాయిత్యం జరిగిన రోజున తల్లి బంధువల ఇంటికి వెల్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ కుర్రాడు తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్లో పోర్న్ చూసిన అతను చెల్లెల్ని రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి నుంచి మొబైల్ ఫోన్ రికవర్ చేశారు. సంజూను జైలుకు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kasganj
- minor sister
- porn clip
- Rape
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

