Varun Kumar | భారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ (Varun Kumar)పై కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌తో పరిచయం ఏర్పడిందని సదరు యువతి ఫిర్యాదులో తెలిపింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఐదేళ్లుగా వరుణ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. కోచింగ్ క్యాంపుల కోసం బెంగళూరులోని సాయి స్టేడియంకు వచ్చిన సమయంలో వరుణ్ తనతో శృంగారంలో పాల్గొనేవాడని ఆరోపించింది. ప్రస్తుతం తన వయసు 22 ఏళ్లు అని తెలిపింది.
ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే.. తనకు అలాంటి ఉద్దేశం లేదని అంటున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని జ్ఞాన భారతి పోలీసులు వరుణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Also Read..
King Charles | కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ
Uttar Pradesh: మొబైల్లో పోర్న్ క్లిప్ చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హత్య చేశాడు
Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా రజినీకాంత్.. రిలీజైన లాల్ సలామ్ ట్రైలర్