Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్‌కోట్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆడుతాడా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం మెడ గాయంతో ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిడ్నీ టెస్టులో గాయమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే గాయాన్ని ఫిజియో పరిశీలించారు. ఈ క్రమంలో విరాట్ రంజీల్లో పాల్గొంటాడా? అన్నది వేచి చూడాల్సిందే. కోహ్లీ చివరిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు.
కెప్టెన్‌గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఆయుష్ బడోనీకి జట్టు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, బడోనీ జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని పంత్ సైతం భావిస్తున్నట్లుగా డీడీసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు పేర్కొన్నారు. రంజీలకు తాను అందుబాటులో ఉంటానని.. కానీ, కెప్టెన్ రోల్ అవసరం లేదని పంత్ పేర్కొనట్లుగా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వరుస టెస్ట్ సిరీస్‌లలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ప్రతి క్రికెటర్ రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా రూల్స్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ముంబయి జట్టుతో ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక యశస్వి జైస్వాల్ ముంబయి తరఫున, శుభ్‌మాన్ గిల్ పంజాబ్ తరఫున రంజీల్లో ఆడనున్నారు.