ECB : ఇంగ్లండ్ జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. మే నెలాఖరులో కరీబియన్ పర్యటన నేపథ్యంలో సెలెక్టర్లు మంగళవారం స్క్వాడ్‌ను ప్రకటించారు. హ్యారీ బ్రూక్(Harry Brook) కెప్టెన్‌గా వన్డేలకు 16, టీ20లకు 15 మందితో కూడిన బృందం పేర్లను వెల్లడించారు. జోస్ బట్లర్ వారసుడిగా ఈమధ్యే పగ్గాలు అందుకున్న బ్రూక్‌కు ఇదే మొదటి సిరీస్. దాంతో, రెండు ఫార్మాట్లలో జట్టును విజేతగా నిలపాలని బ్రూక్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున చెలరేగుతున్న విల్ జాక్స్ (Will Jacks) దాదాపు ఏడాది తర్వాత టీ20లకు ఎంపికయ్యాడు. పేసర్ మాథ్యూ పాట్స్ రెండు సిరీస్‌ల స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. నిరుడు భారత పర్యటనలో తిప్పేసిన స్పిన్నర్ టామ్ హర్ట్లే(Tom Hartley) రెండేళ్ల తర్వాత సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. లియాం డాసన్, పేసర్ ల్యూక్ వుడ్లు కూడా ఏడాది విరామం తర్వాత టీ20 స్క్వాడ్‌కు ఎంపికయ్యారు.
🏏 Who are you backing to have a BIG summer? 🤔#ENGvWI | #EnglandCricket pic.twitter.com/34NuA4adju
— England Cricket (@englandcricket) May 13, 2025
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జోస్ బట్లర్, జో రూట్, జేమీ స్మిత్, బ్రౌడన్ కార్సే, టామ్ హర్ట్లే, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమ్ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బ్యాంటన్, ఆదిల్ రషీద్.
ఇంగ్లండ్ టీ20 స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జోస్ బట్లర్, రెహాన్ అహ్మద్, టామ్ బ్యాంటన్, జాకబ్ బెథెల్, బ్రౌడన్ కార్సే, లియాం డాసన్, సకీబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 12 మందిని విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. కానీ, పవర్ హిట్టర్ అయిన లివింగ్‌స్టోన్‌పై వేటు పడగా ఫిల్ సాల్ట్ టీ20ల్లో చోటు సాధించాడు. అయితే.. గాయంతో బాధ పడుతున్న సీనియర్ పేసర్ మార్క్ వుడ్‌ను పక్కనపెట్టారు. సిరీస్ విజయానికొస్తే.. మే 29న తొలి వన్డే జరుగనుంది. జూన్ 6న పొట్టి సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆతిథ్య వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది.