HERO | సెలబ్రిటీలు రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాల్సి ఉంటుంది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారు తప్పటడుగులు వేయడం ఎంత వరకు సబబు. తాజాగా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్లో వచ్చి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌పై కారుతో దూసుకెళ్లాడు. కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో.. బెల్లంకోండ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సెలబ్రిటీ అయి ఉండి రాంగ్ రూట్లో వచ్చి ఒక తప్పు చేస్తే.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడం మరో తప్పు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే ఇది హీరో కావాలనే చేశాడా? ఇందులో సినిమా స్టంట్ ఏదైనా ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `భైరవం` అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో బెల్లంకొండతో పాటు ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ లు కూడా నటిస్తున్నారు. ముగ్గురు కలిసి నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతుంది.
టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి వంటి సినిమాలతో కూడా పలకరించనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ బాబు నిర్మాత కాగా, ఆయన తనయుడిని నిలబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా కూడా శ్రీనివాస్‌కి హిట్ అనేది దక్కడం లేదు. ఎంతో కష్టపడుతున్నాడు కాని సక్సెస్ అనేది రావడం లేదు.