భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని చెప్పాడు. భారత జట్టులో మూడు మార్పులు జరిగినట్లు సారధి రోహిత్ శర్మ తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ ఆడటం లేదని వెల్లడించిన రోహిత్.. వారి స్థానాల్లో రవి బిష్ణోయి, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ ఆడుతున్నట్లు తెలియజేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్ జట్టు: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రావ్మెన్ పావెల్, డెవాన్ థామస్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, డొమినిక్ డ్రేక్స్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్
🚨 Team Update 🚨
3⃣ changes for #TeamIndia as @IamSanjuSamson, @akshar2026 & @bishnoi0056 are named in the team. #WIvIND
Follow the match ▶️ https://t.co/DNIFgqfRJ5
A look at our Playing XI 🔽 pic.twitter.com/BWPmuyZNf9
— BCCI (@BCCI) August 6, 2022