వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్‌ను థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా విఫలమయ్యాడు.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మెకాయ్ ముందుకు దూకి క్యాచ్ పూర్తి చేశాడు. దాంతో పాండ్యా నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో రోహిత్ శర్మ (54 నాటౌట్) హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులతో నిలిచింది.