జమైకా: వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది.
కరీబియన్లు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 15.2 ఓవర్లలోనే దంచేసింది. జోష్ ఇంగ్లిస్ (33 బంతుల్లో 78, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (32 బంతుల్లో 56, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన మూడో వికెట్‌కు 131 పరుగులు జోడించి ఆసీస్‌కు అదిరిపోయే విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది.