ట్రినిడాడ్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్‌పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 295 పరుగుల ఛేదనలో పాక్.. 29.2 ఓవర్లలో 92 రన్స్‌కే చేతులెత్తేసింది.
వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ (6/18) ఆరు వికెట్లతో చెలరేగగా స్పిన్నర్ గుడకేశ్ మోటీ (2/37) రెండు వికెట్లు తీశాడు. సల్మాన్ అఘా (30) టాప్ స్కోరర్. ఈ విజయంతో వెస్టిండీస్.. 34 ఏండ్ల తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. కెప్టెన్ షై హోప్ (120*) శతకంతో మెరిశాడు.