భారత్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్‌తో తమతో అంత వీజీ కాదని తెలిపాడు. టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
శుక్రవారం తొలి టీ20 ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన పూరన్.. ‘వన్డేలతో పోల్చితే టీ20లలో మాది ప్రత్యేకమైన జట్టు. ఈ సిరీస్‌లో మేము టీమిండియాను ఓడిస్తాం. జట్టులో ఆటగాళ్లంతా సవాళ్లకు సిద్ధంగా ఉన్నారు..’ అని తెలిపాడు. ఈ సిరీస్ కోసం కరేబియన్ జట్టు టీ20 స్పెషలిస్టు షిమ్రన్ హెట్మెయర్ను జట్టులోకి ఎంపిక చేసింది. అతడి చేరిక జట్టుకు ఉపకరిస్తుందని పూరన్ అభిప్రాయపడ్డాడు.
ఈ సిరీస్‌లో తాము భాగస్వామ్యాల మీద దృష్టి పెట్టాల్సి ఉందని పూరన్ అన్నాడు. తద్వారా భారీ స్కోరు చేసే అవకాశం చిక్కుతుందని చెప్పాడు. ఇదిలాఉండగా భారత్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు విండీస్ జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టులో హెట్మెయర్తో పాటు జేసన్ హోల్డర్నూ చేర్చింది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు విండీస్ జట్టు : నికోలస్ పూరన్ (కెప్టెన్), రొవ్మన్ పావెల్, బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్మెయర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, కీమో పాల్, రొమారియా షెఫర్డ్, ఒడియన్ స్మిత్, డెవాన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్