ఫ్లోరిడా: స్వదేశంలో ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు, టీ20 సిరీస్‌లలో దారుణంగా ఓడిన వెస్టిండీస్.. పాకిస్థాన్‌తోనూ అదే పరాభవాల పరంపరను కొనసాగిస్తున్నది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఫ్లోరిడా వేదికగా జరిగిన తొలి టీ20లో కరీబియన్ జట్టు 14 పరుగుల తేడాతో ఓటమిపాలై వరుసగా ఆరో టీ20 ఓటమిని మూటగట్టుకుంది.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది. సయీమ్ అయూబ్ (57) రాణించాడు. ఛేదనలో విండీస్.. నిర్ణీత ఓవర్లలో 164/7 వద్దే ఆగిపోయింది.