అంటిగ్వా: స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విండీస్ 450/9 పరుగుల స్కోరు చేయగా బంగ్లాదేశ్ 269/9కు పరిమితమైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో కరీబియన్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ అయింది. 334 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్.. 132 పరుగులకే కుప్పకూలడంతో ఆతిథ్య విండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది.