షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్బంగ్లాను చిత్తుగా ఓడించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి గ్రూపు-బిలో టాప్‌లోకి దూసుకొచ్చింది. బంగ్లా నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ హిలీ మాథ్యూస్(34), స్టెఫానీ టేలర్(27) రాణించారు. నహీద, మరూఫా ఒక్కో వికెట్ తీశారు. తొలుత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరిష్మా(4/17) ధాటికి బంగ్లా 20 ఓవర్లలో 103/8 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ సుల్తానా(39) టాప్ స్కోరర్.