West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పడింది. బోర్డుపై అసంతృప్తితో ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఏండ్లుగా సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract) కోసం నిరీక్షిస్తున్న ఆటగాళ్లకు బోర్డు తీపి కబురు చెప్పింది. తమ దేశ చరిత్రలోనే తొలిసారి ఆటగాళ్లకు ఏడాది కంటే ఎక్కువ రోజుల కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టు గురువారం వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. పురుషుల, మహిళల జట్లలోని తొమ్మిది మంది(నవరత్నాలు)కి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది.
మల్టీ ఇయర్ కాంట్రాక్ట్‌తో పాటు ప్రతిభావంతులైన యువ కెరటాలకు వార్షిక కాంట్రాక్ట్‌లను బోర్డు ప్రకటిచింది. పురుషుల, మహిళల టీమ్‌ల నుంచి మరో తొమ్మిది మందిని ఏడాది కాంట్రాక్ట్ కింద నమోదు చేశామని వెల్లడించింది. బోర్డు నుంచి స్థిరమైన ఆదాయం అందుకునేవాళ్లలో వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్.. ‘గబ్బా టెస్టు హీరో’ షమర్ జోసెఫ్ (Shamar Joseph), స్పిన్నర్ గుడకేశ్ మోతీ, ఓపెనర్ షాహ్ హోప్, యువ పేసర్ జైడన్ సీల్స్.. మహిళల జట్టు ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ (Healy Mathews), స్టఫానీ టేలర్, క్యాంప్‌బెల్‌లు ఉన్నారు.
🚨 Breaking News🚨
Cricket West Indies, for the first time, has awarded 9️⃣ multi-year retainer contracts for Men’s & Women’s teams.👏🏾Read More⬇️https://t.co/dsKEj2R4lY pic.twitter.com/NCXhIFMPbd
— Windies Cricket (@windiescricket) October 2, 2024
‘ప్రస్తుత పరిస్థితులకు, ఆటకు తగ్గట్టుగా క్రికెటర్లతో మాట్లాడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంది. పురుషుల, మహిళల జట్లలోని తొమ్మిది మంది మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశౄరు. కాంట్రాక్ట్ గెలచుకున్నవాళ్లకు అభినందనలు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శన చేసిన వాళ్లంతా రాబోయే రోజుల్లో కూడా మెరుగ్గా రాణిస్తారని ఆశిస్తున్నా’ అని బోర్డు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మిలెస్ బాస్కోంబే తెలిపాడు.
2 ఏండ్ల కాంట్రాక్ట్ : షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, జైడన్ సీల్స్. హేలీ మాథ్యూస్, స్టఫానీ టేలర్, షెమైనే క్యాంప్‌బెల్.
వార్షిక కాంట్రాక్ట్ : అలిక్ అథనజే, క్రెగ్ బ్రాత్‌వైట్, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, జోషువా ద సిల్వా, కవెమ్ హొడ్గే. అకీల్ హొసేన్, రొమారియో షెపర్డ్, రొవ్మన్ పావెల్, అలియాహ్ అల్లెయ్నె, షమిలియా కొన్నెల్, డియాండ్ర డాటిన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ అన్ ఫ్రేజర్, చిన్నెల్లె హెన్రీ, జైదా జేమ్స్, క్వియనా జోసెఫ్, చెడియాన్ నేషన్, కరిష్మా రామ్హరాక్, రషద విలియమ్స్, అశ్మిని మనిసర్.