BANW vs SCOW : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడా పండుగ మొదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ వేడుకలు అట్టహాసంగా షురూ అయ్యాయి. అరబ్ దేశం అతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఆరంభ పోరులో స్కాట్లాండ్ (Scotland)తో తలపడుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటింగ్ తీసుకుంది.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. స్కాంట్లాడ్ సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. దాంతో, మొదటి బోణీ ఎవరిదో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టీ20 వరల్డ్ కప్‌ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న రెండు జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. ఇక.. రాత్రి 7: 30 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఢీ కొట్టనున్నాయి.
Women’s T20 World Cup 2024, here we go!https://t.co/BxGaM4EdPC | #T20WorldCup pic.twitter.com/pagfD51uTY
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2024
స్కాట్లాండ్ జట్టు : సస్కియా హొర్లే, సరాహ్ బ్రైసీ(వికెట్ కీపర్), ఐస్‌లా లిస్టెర్, ప్రియాంజ్ ఛటర్జీ, డార్సే కార్టేర్, లొర్నా జాక్, క్యాథెరిన్ ఫ్రేజర్, రాచెల్ సాల్టర్, అబ్తహ మక్సూద్, ఒలివియా బెల్.
బంగ్లాదేశ్ జట్టు : ముర్షిదా ఖాతూన్, శాతి రాణీ, శోభన మొస్ట్రే, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), తాజ్ నెహర్, షొర్నా అక్తర్, రీతు మొని, ఫాతిమా ఖాతూన్, రబెయ ఖాన్, నహిదా అక్తర్, మురుఫా అక్తర్.