కొలంబో: శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ(Jayawickrama)పై ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు. యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘించిన కేసులో అతనిపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన జయవిక్రమపై కేసు బుక్కైంది. మ్యాచ్ ఫిక్సింగ్‌లు, విచారణకు అడ్డుపడిన ఘటనల్లో .. ఐసీసీకి రిపోర్టు చేయడంలో అతను విఫలం అయ్యాడు. 26 ఏళ్ల క్రికెటర్ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు అంగీకరించాడు. తప్పు ఒప్పుకోవడంతో, అతనిపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు ఐసీసీ తెలిపింది. 2021 సీజన్లో లంక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు జయవిక్రమపై ఆరోపణలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో స్పిన్నర్ జయవిక్రమ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అతను 11 వికెట్లు తీసుకున్నాడు. అతను 5 టెస్టు మ్యాచ్‌లు , 5 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.