Suryakumar Yadav | ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్ ( second ODI)లో టీమ్ ఇండియా 399 పరుగులు చేసి ఆసీస్‌పై విజయం సాధించింది. యువ ఓపెనర్ శుభ్ గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రెచ్చిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యపకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా సిక్సుల మోత మోగించాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆసీస్ బౌలర్ కెమెరాన్ గ్రీన్ (Cameron Green) వేసిన ఓకే ఓవర్లో వరుసగా సిక్సులు బాదాడు. 43వ ఓవర్లో మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో విశ్వరూపం చూపారు. అనంతరం వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317గా నిర్ణయించగా.. కంగారూలు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే టీమ్ఇండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు, 30 ఫోర్లు బాదారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం జరుగనుంది.
6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
Also Read..
TeamIndia | టీమ్ఇండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి జట్టుగా రికార్డు
Rs 2,000 Notes | రూ.2వేల నోట్ల మార్పిడికి మరో 5 రోజులే గడువు..
Sudha Murty | తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి