Rs 2,000 Notes | రూ.2వేల నోట్ల మార్పిడికి మరో 5 రోజులే గడువు..
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (Rs 2000 Notes)ను ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది.
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (Rs 2000 Notes)ను ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. రూ.2వేల కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగియబోతోంది. ఈ క్రమంలోనే ఎవరైన తమ వద్ద ఇంకా రూ.2వేల నోట్లు ఉంటే మార్చుకుంటే బెటర్.
కాగా, ఈ నోట్ల మార్చుకునేందుకు 5 రోజులే సమయం ఉండగా.. అందులో ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకూ (సోమవారం నుంచి బుధవారం) బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. అనంతరం 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నాలుగు రోజుల్లోనే మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. అందుకని వినియోగదారులు బ్యాంకు పనివేళలను తెలుసుకొని 2వేల రూపాయల నోట్లతో వెళ్తే మంచిది. మరోవైపు పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు చివర్లో సెలవుల నేపథ్యంలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఇంకో రెండువారాల గడువు ఇచ్చే అవకావం ఉందని అంచాన వేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను ఇప్పటికే మార్చుకున్నారు. బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, సెప్టెంబరు 1 నాటికే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఆర్బీఐ వద్దకు చేరాయి. దీంతో దేశంలో చలామణిలోకి పంపిన రూ.2వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే వెల్లడించింది.
Also Read..
Sudha Murty | తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి
Viral Video | వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట.. వీడియో
Asaduddin Owaisi | వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి : రాహుల్‌కు ఒవైసీ సవాల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

