Sudha Murty | తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి
Sudha Murty | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) పోలీసులను ఆశ్రయించారు. తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
Sudha Murty | ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (Infosys Co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధామూర్తి (Sudha Murty ) అందరికీ సుపరిచితులే. విద్యావేత్త, రచయిత, అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ (Infosys Foundation chairperson) గా కొనసాగుతున్నారు. కాగా, తాజాగా సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. తన పేరును దుర్వినియోగ పరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సుధామూర్తి తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.
అమెరికాలో సెప్టెంబరు 26న జరగనున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారంటూ… శ్రుతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు డబ్బు తీసుకుంది. ఈ వ్యవహారం సుధామూర్తి కార్యాలయం దృష్టికి రావడంతో సీరియస్ గా తీసుకున్నారు. మరోఘటనలో, కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా 50వ వార్షికోత్సవం సందర్భంగా సుధామూర్తికి ఇటీవలే ఆహ్వానం అందింది. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ కొందరు సుధామూర్తి ఆ కార్యక్రమానికి హాజరువుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ మేరకు డబ్బు వసూలు చేశారు. ఈ విషయం ఆగస్టు 30వ తేదీన సుధామూర్తి దృష్టికి చేరింది. లావణ్య అనే మహిళ తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శిని అని చెప్పి పలువురిని మోసం చేసినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన సుధామూర్తి లావణ్య, శ్రుతిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Viral Video | వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట.. వీడియో
Asaduddin Owaisi | వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి : రాహుల్కు ఒవైసీ సవాల్
Mukesh Ambani | ఏకదంతుడి సేవలో అంబానీ కుటుంబం.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

