KCR | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ‘అమ్మా.. బాగున్నారా..!’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన ఇంటికొచ్చిన అతిథులైన మహిళా మంత్రులను ఆత్మీయంగా పలకరించారు. అతిథి మర్యాదలతో సాదర స్వా గతం పలికారు. పసుపు-కుంకుమలు, చీర, తాంబూలాలతో వారిని ఘనంగా సత్కరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను కేసీఆర్-శోభమ్మ దంపతులు ఆత్మీయంగా పలకరించి సాదర స్వాగతం పలికారు.
పసుపు-కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలు అందజేసి సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం మహిళా మంత్రు లు మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించాలని కేసీఆర్‌ను ప్రభు త్వం తరఫున ఆహ్వానించారు. శాలువాకప్పి ఆహ్వాన పత్రికతోపాటు మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం అందజేశారు. తదనంతరం తేనీటి విందు స్వీకరించారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఇష్ఠాగోష్టి అనంతరం మహిళామంత్రులు తిరుగు పయనం అయ్యారు. కాగా, అంతకుముందు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులను మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సాదరంగా ఆహ్వానించారు.
బాగున్నరా.. అమ్మ!
రాష్ట్ర మహిళా మంత్రులకు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం
అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం
తన ఇంటికి వచ్చిన రాష్ట్ర… pic.twitter.com/6mrzyWoz86
— BRS Party (@BRSparty) January 8, 2026