TeamIndia | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమ్ఇండియా (TeamIndia) దుమ్మురేపుతోంది. ఇటీవలే ఆసియాకప్‌ను చేజిక్కించుకున్న భారత్.. తాజాగా వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia )ను చిత్తు చేసింది. ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ( second ODI)లో టీమ్ ఇండియా 399 పరుగులు చేసి ఆసీస్‌పై విజయం సాధించింది. ఈ క్రమంలో టీమ్ఇండియా మరో అరుదైన ఘనత సాధించింది. వన్డే క్రికెట్ చరిత్ర (ODI Cricket History)లో 3000కిపైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా అవతరించింది.
కాగా, మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో విశ్వరూపం చూపారు. అనంతరం వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317గా నిర్ణయించగా.. కంగారూలు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే టీమ్ఇండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు, 30 ఫోర్లు బాదారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం జరుగనుంది.
Also Read..
Asian Games | రోయింగ్‌లో భారత్‌కు నాలుగో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం